దారుణం.. చిన్నారిని భవనం పైనుంచి పడేసిన తల్లి
MDCL: కన్నతల్లి తన ఏడేళ్ల చిన్నారిని భవనం పైనుంచి పడేసి హత్య చేసిన ఘటన నగరంలో చోటుచేససుకుంది. మల్కాజ్‌గిరి PS పరిధిలోని వసంతపురి కాలనీలో మోనాలిసా తన ఏడేళ్ల కూతురు షారోన్ మేరీని 3వ అంతస్తు పైనుంచి పడేసింది. తీవ్ర గాయాలపాలైన చిన్నారిని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.