శాశ్వత ఆధార్ కేంద్రాన్ని ప్రారంభించిన తహసీల్దార్

శాశ్వత ఆధార్ కేంద్రాన్ని ప్రారంభించిన తహసీల్దార్

SRCL: కోనరావుపేట మండలం కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో శాశ్వత ఆధార్ నమోదు కేంద్రాన్ని తహసీల్దార్ వరలక్ష్మి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మండల కేంద్రంలోని ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఆధార్ నమోదు కేంద్రం ప్రారంభించామని, ప్రజలు ఈ ఆధార్ కేంద్రాన్ని వినియోగించుకోవాలని సూచించారు.