ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఎంపీడీవో
కృష్ణా: గుడ్లవల్లేరు (M) అంగలూరు గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులను ఎంపీడీవో ఇమ్రాన్ మంగళవారం పరిశీలించారు. పని స్థలాలను సందర్శించి, జరుగుతున్న పనులు నాణ్యత, కార్మికుల హాజరు,పని విధానాన్ని పర్యవేక్షించారు. అనంతరం కార్మికులతో మాట్లాడి, వారికి అంటుతున్న ఉపాధి హామీ వేతనాల గురించి అడిగి తెలుసుకున్నారు. పనుల వివరాలను యాప్‌లో నమోదు చేయాలన్నారు.