సాగర్ తీరంలో ఫిట్నెస్ పోటీలు
VSP: బీచ్ రోడ్లో యువతకు ఆదివారం శారీరక ధారుడ్యంపై పోటీలను నిర్వహించారు. దీంట్లో నగరానికి చెందిన యువత ఉత్సాహంగా పాల్గొని తమ శారీరక శక్తిని ప్రదర్శించారు. సాగర తీరంలో సందర్శకులంతా వీరిని ఆసక్తిగా తిలకించారు. ఆరోగ్య అవగాహన పెంచడానికి ఈ కార్యక్రమం చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.