అన్నవరంలో ఘనంగా హర్ ఘర్ తిరంగా

ELR: నూజివీడు మండలం అన్నవరంలోని జడ్పీ హైస్కూల్ ఆవరణంలో గురువారం హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం విజయకుమారి మాట్లాడుతూ.. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని పాఠశాల గోడలపై త్రివర్ణ పతాకం చిత్రీకరణ చేసినట్లు చెప్పారు. ప్రతి ఇంటి పై, ప్రతి వ్యక్తి గుండెలలో త్రివర్ణ పతాకం, దేశభక్తి రెపరెపలాడాలని పిలుపునిచ్చారు.