బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత
ADB: నేరడిగొండ మండలంలోని బోరిగామ గ్రామంలో ప్రమాదవశాత్తు జరిగిన అగ్నిప్రమాదంలో 5 ఇళ్లు కాలి బూడిద అయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ బాధిత కుటుంబ సభ్యులను నిన్న పరామర్శించారు. తనవంతుగా రూ. 10 వేల ఆర్థిక సాయం అందజేశారు. ధైర్యంగా ఉండమని భరోసా కల్పించారు.