నల్లగొండలో భద్రతా తనిఖీలు

NLG: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. SP శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు బాంబ్ స్క్వాడ్, నార్కోటిక్ డాగ్ సిబ్బందితో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, సినిమా హాళ్లు, ప్రభుత్వ కార్యాలయాల్లో తనిఖీలు జరిపారు. అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. అనుమానాస్పదుల గురించి 100కి డయల్ చేయాలనీ తెలిపారు.