రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

NLG: రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని దేవరకొండ పట్టణంలోని ఈద్గా మైదానంలో నిర్వహించిన ఈద్-ఉల్-ఫితర్ సామూహిక ప్రార్థన కార్యక్రమంలో దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం మైనార్టీ సోదరులతో కలిసి ప్రార్థనల్లో పాల్గొని, ముస్లిం మత పెద్దలు, సోదరులతో ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.