పుట్టపర్తిలో బుల్లెట్ పై పర్యటించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ

పుట్టపర్తిలో బుల్లెట్ పై పర్యటించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ

సత్యసాయి: జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ ఐఏఎస్, ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ పుట్టపర్తిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఏర్పాట్లను బుల్లెట్‌పై విహరిస్తూ పరిశీలించారు. పార్కింగ్, లైటింగ్, శానిటేషన్, త్రాగునీరు, విమానాశ్రయం, హెలిప్యాడ్, రోడ్లు, స్టేడియం ప్రాంతాల్లో పనులను నవంబర్ 13లోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.