'వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి'
MNCL: వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని మంచిర్యాల రూరల్ సీఐ ఆకుల అశోక్ అన్నారు. మంగళవారం రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమంలో మాట్లాడుతూ.. ట్రాఫిక్ నియమాలు పాటించకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతూ ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. వాహనాలు నడిపే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్, సీటు బెల్టు ధరించాలని సూచించారు.