VIDEO: అంతర్ రాష్ట్ర రహదారిపై గ్రామస్తుల రాస్తారోకో

ADB: తలమడుగు మండలంలోని ఖోడద్ గ్రామస్థులు గురువారం అంతర్ రాష్ట్ర రహదారిపై బైఠాయించి రాస్తా రోకో నిర్వహించారు. వరద కారణంగా ఇళ్లలోకి నీరు వచ్చి చేరుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. కల్వర్టు లేకపోవడంతో ఇళ్ళు నీట మునుగుతున్నాయని ఆరోపించారు. తలమడుగు ఎస్సై రాధిక అక్కడికి చేరుకొని సర్ది చెప్పినప్పటికీ కలెక్టర్ వచ్చే వరకు కదిలే ప్రసక్తేలేదని తేల్చిచెప్పారు.