రుద్రవరం పంచాయతీలకు ప్రత్యేక అధికారులు

రుద్రవరం పంచాయతీలకు ప్రత్యేక అధికారులు

నంద్యాల: రుద్రవరం మండలంలోని 21 గ్రామ పంచాయతీల పాలన కోసం జిల్లా అధికారులు ప్రత్యేక అధికారులను నియమించారు. శ్రీరంగాపురం తదితర గ్రామాలకు ఎంపీడీవో భాగ్యలక్ష్మి, మరికొన్ని గ్రామాలకు డిప్యూటీ ఎంపీడీవో ప్రసాద్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. చందలూరు ప్రాంతానికి వ్యవసాయ అధికారి సుమతి, రుద్రవరం పరిధిలోని గ్రామాలకు డాక్టర్ మనోరంజన్ ప్రతాప్‌ను నియమించినట్లు వెల్లడించారు.