ప్రభుత్వ ఆస్పత్రుల్లో వృద్ధులకు ప్రత్యేక సేవలు

ప్రభుత్వ ఆస్పత్రుల్లో వృద్ధులకు ప్రత్యేక సేవలు

TG: అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వృద్ధులకు ప్రత్యేక వైద్య సేవలు అందించాలని అధికారులను మంత్రి రాజనర్సింహ ఆదేశించారు. ఇప్పటికే అన్ని జనరల్, జిల్లా ఆస్పత్రుల్లో జెరియాట్రిక్ వార్డులు ఏర్పాటుచేసినట్లు తెలిసేలా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. చికిత్సల పేరిట ప్రజలను దోచుకుంటున్న ప్రైవేట్ ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు.