బొలెరో ఢీకొని యువకుడు మృతి

బొలెరో ఢీకొని యువకుడు మృతి

MLG: బొలెరో వాహనం ఢీకొనడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ములుగు మండలం జంగాలపల్లి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. జాకారం గ్రామానికి చెందిన కీర్తి శంకర్ (32) బైక్‌పై వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది. అతి వేగం, అజాగ్రత్త కారణంగా బొలెరో వాహనం ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతున్నట్లు ఎస్సై ఉపేందర్ రావు వెల్లడించారు.