నేడు భూమిపూజ చేయనున్న ఎమ్మెల్యే
WNP: జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి నేడు మంగళవారం ఉదయం 9:30 గంటలకు భూమిపూజ చేయనున్నారు. వనపర్తి పట్టణం రాజపేట శివారులోని సర్వే నెంబర్ 73/2 లో ఒక ఎకరం భూమిలో ఈ కార్యాలయం నిర్మించబడుతుంది. ఈ కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.