HYDలో పలు ప్రాంతాల్లో చిరుజల్లులు
HYD: నగరంలో పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో వడగళ్ల వాన కురిసింది. మండే వేసవి ఎండలతో అల్లాడుతున్న నగర వాసులకు ఈ అకాల వర్షం ఒక్కసారిగా వాతావరణాన్ని చల్లబరిచి పెద్ద ఉపశమనాన్ని కలిగించింది. వేడి గాలుల నుంచి విముక్తి లభించడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.