కాళేశ్వరంలో పీఠాధిపతుల పుణ్యస్నానాలు
JGL: ఉత్తర భారతదేశానికి చెందిన అయోధ్య, కాశీ ప్రయాగ, చిత్రకూట్, బృందావన్‌తో పాటు వివిధ ఆశ్రమాలకు చెందిన పీఠాధిపతులు, సన్యాసులు సోమవారం కాళేశ్వరం త్రివేణి సంగమ తీరంలో పుణ్యస్నానాలు ఆచరించారు. పరమ పూజ్య మలుక్ పీఠాదీశ్వర్ శ్రీ జగద్ గురుదావరాచార్య స్వామి రాజేంద్ర దాస్ మహారాజ్ సుమారు 600 మంది సాధువులతో గోదావరి నది పరిక్రమలో భాగంగా కాళేశ్వరంలో పుణ్యస్నానాలు చేసారు.