VIDEO: కలెక్టరేట్ ముందు కుటుంబం ఆత్మహత్యాయత్నం

VIDEO: కలెక్టరేట్ ముందు కుటుంబం ఆత్మహత్యాయత్నం

KNR: కలెక్టరేట్ ప్రజావాణి వద్ద గన్నేరువరం (M) గోపాల్పూర్‌కు చెందిన ఓ కుటుంబం గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. పోలీసులు వెంటనే వారిని అడ్డుకున్నారు. దాదాపు 70 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న తమ 8 ఎకరాల భూమిని కొందరు వ్యక్తులు అక్రమంగా పత్రాలు సృష్టించి లాక్కున్నారని వారు ఆరోపించారు. అధికారుల చుట్టూ తిరిగినా న్యాయం జరగకపోవడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు వారు తెలిపారు.