పుట్లూరులో పర్యటించిన ఉద్యానవన శాస్త్రవేత్త
ATP: పుట్లూరు(M) మడుగుపల్లె గ్రామంలో బుధవారం ఉద్యానవన శాస్త్రవేత్త శ్రీనివాసరెడ్డి పర్యటించారు. అరటి పంటలో ఆకు మచ్చ తెగుళ్లపై రైతులకు పలు సూచనలు, సలహాలు చేశారు. ఫ్రూట్ కేర్ యాక్టివిటీ కొరకు పిచికారి మందులు, ఎరువుల మోతాదులపై జాగ్రత్త వహించాలని అరటి రైతులకు సూచించారు. కార్యక్రమంలో ఉద్యాన సహాయ సంచాలకులు దేవానంద్, HO నెట్టికంటయ్య పాల్గొన్నారు.