'రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలి'
WGL: రైతులు పంట ఉత్పత్తులను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని అదనపు కలెక్టర్ సంధ్యారాణి అన్నారు. మంగళవారం వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్య కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా పరిశీలించారు. రైతులకు అన్ని వసతులు కల్పించాలని నిర్వాహకులను ఆదేశించారు.