బ్లాక్ స్పాట్‌లను సందర్శించిన సీపీ
PDPL: 'అరైవ్.. అలైవ్' కార్యక్రమంలో భాగంగా రామగుండం సీపీ అంబర్ కిషోర్ గోదావరిఖని బీ-గెస్ట్ హౌస్ మూలమలుపు, ఇందారం క్రాస్ రోడ్డు వద్ద ఉన్న బ్లాక్ స్పాట్లను సందర్శించారు. ఐలాండ్ల ఏర్పాటు డిజైన్, ప్రమాదాలు జరగడానికి గల కారణాలు, నివారణ చర్యలపై ఆయన అధికారులతో చర్చించారు. సీపీ వెంట ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, HKR సంస్థ అధికారులు ఉన్నారు.