ధాన్యం కొనుగోలు సమస్యలపై కంట్రోల్ రూమ్ ఏర్పాటు
HNK: జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో మంగళవారం రాత్రి ధాన్యం కొనుగోలు కేంద్రాల కంట్రోల్ రూమ్‌ను జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ ప్రారంభించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కంట్రోల్ రూమ్ పనిచేసేలా ఏర్పాటు చేశారు. 7330751364 అనే కంట్రోల్ రూమ్ నెంబర్‌ను కలెక్టర్ ప్రకటించారు.