పిడుగుపాటుకు మహిళ మృతి

పిడుగుపాటుకు మహిళ మృతి

PPM: వీరఘట్టం మండలంలో ఆదివారం సాయంత్రం పిడిగులతో కూడిన వర్షం ధాటికి తెట్టంగి గ్రామానికి చెందిన పైల అనసూయమ్మ (60) పిడుగుపాటుకు గురై మృతి చెందింది. స్దానికుల వివరాల ప్రకారం.. గ్రామ సమీపంలో వ్యవసాయ పనులు ముగించుకుని తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసినట్లు స్దానిక ఎస్‌ఐ తెలిపారు.