నేడు వైరాలో పర్యటించనున్న ఎమ్మెల్యే రాందాస్

నేడు వైరాలో పర్యటించనున్న ఎమ్మెల్యే రాందాస్

KMM: వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ సోమవారం వైరా మండలంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మ.2 గంటలకు స్నానాల లక్ష్మీపురం గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయనిధి చెక్కులను సంబంధిత లబ్ధిదారులకు పంపిణీ చేస్తారని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శీలం వెంకట నర్సిరెడ్డి తెలిపారు.