రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
KRNL: పెద్దకడబూరు మండలం హనుమపురం గ్రామ సమీపంలోని జాతీయ రహదారిలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు అధికారులు ముందడుగు వేశారు. ఎస్సై మారుతి ఆదేశాల మేరకు ASI శివరాములు శుక్రవారం రహదారి పక్కన అడ్డుగా పెరిగి, వాహనదారుల దృష్టిని దెబ్బతీస్తున్న కంపచెట్లను తొలగించారు. ఈ చర్యతో ఎదురు ఎదురుగా వస్తున్న వాహనాలు సురక్షితంగా ప్రయాణించేందుకు వీలవుతుందన్నారు.