VIDEO: వచ్చే వారం SRSP నీటి విడుదల
SRPT- సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ నియోజకవర్గాల రైతులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఎండిపోతున్న పంటలను కాపాడేందుకు వచ్చే వారం ఎస్సారెస్పీ నీటిని విడుదల చేయనుంది. చివరి ఆయకట్టు వరకు నీరు అందేలా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. సాగునీటి ఎద్దడితో ఆందోళన చెందుతున్న అన్నదాతలకు ఈ నిర్ణయంతో పెద్ద ఉపశమనం లభించింది.