'ఆధ్యాత్మికత ఉట్టిపడేలా నవరాత్రి ఉత్సవాలు'

ADB: మున్నూర్ కాపు సంఘ భవనంలో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కాళ్ల విఠల్ పేర్కొన్నారు. ఆదివారం సంఘ భవనంలో నవరాత్రి ఉత్సవాల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ ఏడాది గణేష్ నవరాత్రి ఉత్సవాలలో మాల దరణ ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షుడు రవి, ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్, తదితరులున్నారు.