VIDEO: సంక్రాంతి సమరానికి ‘పందెం కోళ్లు’ సిద్ధం
W.G: సంక్రాంతి పర్వదినం సమీపిస్తుండటంతో గోదావరి జిల్లాల్లో అప్పుడే సందడి మొదలైంది. ముఖ్యంగా ఆకివీడు, భీమవరం ప్రాంతాల్లో పందెం కోళ్లను బరిలో దింపేందుకు యజమానులు సన్నాహాలు చేస్తున్నారు. వీటిని చంటిబిడ్డల్లా సాకుతూ.. ప్రత్యేక ఆహారం, సకల సౌకర్యాలతో ముస్తాబు చేస్తున్నారు. పండుగకు ఇంకా సమయం ఉన్నప్పటికీ, ఇప్పటి నుంచే కోళ్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు.