రోడ్డు బాగు చేయాలని మహిళల వినూత్న నిరసన(VIDEO)

RR: మాడ్గుల మండలంలో రోడ్లు అధ్వాన్నంగా మారడంతో మహిళలు వినూత్నంగా నిరసన తెలిపారు. గుంతలు పడిన రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో అందులో వరినాట్లు వేసి సోమవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ.. గత కొన్ని నెలలుగా ఇదే పరిస్థితి ఉందని, గుంతల కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తొందరగా రోడ్లను బాగు చేయాలని వారు కోరారు.