వీధి కుక్కల దాడిలో 10 మేకపిల్లలు మృతి

వీధి కుక్కల దాడిలో 10 మేకపిల్లలు మృతి

నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం గంగారం గ్రామపంచాయతీలోని అలుగుతాండలో శనివారం వీధి కుక్కల దాడిలో పది మేకపిల్లలు మృతి చెందిన సంఘటన కలకలం రేపింది. రెక్క ఆడితే గాని డొక్కాడని గిరిజన కుటుంబాలలో వీధి కుక్కలు తీవ్ర నష్టాన్ని మిగులుచుతున్నాయని స్థానికులు తెలిపారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.