నేడు తిరుమలకు రాష్ట్రపతి

నేడు తిరుమలకు రాష్ట్రపతి

AP: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ తిరుపతికి రానున్నారు. ఇందుకోసం ఆమె మ. 3:25 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం, రోడ్డు మార్గంలో బయలుదేరి మ. 3:55 గంటలకు తిరుచానూరులోని పద్మావతి అమ్మవారిని దర్శించుకోనున్నారు. రేపు ఉదయం ఆమె వరాహస్వామిని, తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. దర్శనం అనంతరం తిరుపతి నుంచి హైదరాబాద్‌కు బయలుదేరనున్నారు.