VIDEO: పోలింగ్ గడువు సమీపించగా ఓటర్ల పరుగులు
WGL: వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల పోలింగ్ గడువు సమయం సమీపించడంతో నేడు సాయంత్రం 5 గంటల ముందు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు పరుగులు పెట్టారు. సమయం దాటితే లోనికి అనుమతించబోమని ఎన్నికల అధికారులు స్పష్టం చేయడంతో చివరి నిమిషంలో ఓటర్లు పెద్ద సంఖ్యలో కేంద్రాలకు చేరుకున్నారు. అన్ని పోలింగ్ బూతుల్లో దాదాపు ఓటర్లు హక్కు వినియోగించుకున్నారు.