నేడు మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం
E.G: మండపేట పురపాలక సంఘం కౌన్సిల్ అత్యవసర సమావేశం ఇవాళ ఉదయం 11 గంటలకు నిర్వహిస్తున్నట్లు పురపాలక సంఘం ఛైర్ పర్సన్ పతివాడ నూక దుర్గా రాణి సోమవారం పేర్కొన్నారు. మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ మందిరంలో ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అజెండాలోని 41 అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.