దోషులకు శిక్ష తప్పదు: మహేష్ కుమార్ గౌడ్
TG: కాళేశ్వరంపై హైకోర్టు తీర్పు BRS నేతలకు క్లీన్ చిట్ కాదని TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. తదుపరి చర్యలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని, ఎంత ఆలస్యమైనా అవినీతి దోషులకు శిక్ష తప్పదని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం పదేపదే కోరుతున్నా.. కేంద్రం ఈ కుంభకోణంపై సీబీఐ విచారణ ఎందుకు జరిపించడం లేదని ఆయన ప్రశ్నించారు.