నేటి నుంచి 'సేంద్రియ ఆహార మేళా'
ఏలూరు డీసీఎంఎస్ ఫంక్షన్ హాలులో శనివారం నుంచి రెండు రోజుల పాటు 'సహజ, సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా' నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. ఈ ప్రదర్శనలో సేంద్రియ ఉత్పత్తుల అమ్మకాలతో పాటు, రసాయన ఎరువుల వాడకం వల్ల కలిగే దుష్ప్రభావాలు, ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల వల్ల చేకూరే ఆరోగ్య ప్రయోజనాలపై నిపుణులు అవగాహన కల్పించానున్నారు.