నేడు ఎమ్మెల్యే పర్యటన వివరాలు

NLG: నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం బుధవారం మధ్యాహ్నం చిట్యాల మండలంలో పర్యటించనున్నారు. మ.2:30కు వెలిమినేడు, 3:00కు పిట్టంపల్లి, 3:30కి చిన్నకాపర్తి, 4:00కు ఆరెగూడెం, 4:25కు పెద్దకాపర్తి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తారని చిట్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుడిపాటి లక్ష్మీనరసింహ తెలిపారు.