బ్యాలెట్ పేపర్‌ను మింగేసిన ఓటర్
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్‌లో ఓ వృద్ధుడు బ్యాలెట్ పేపర్‌ను మింగాడు. ఓటు వినియోగించుకోడానికి పోలింగ్ బూత్‌కు వచ్చిన వెంకట్ అనే వృద్ధుడు మద్యం మత్తులో బాక్స్‌లో వేయాల్సిన వార్డు మెంబర్ బ్యాలెట్ పేపర్‌ను మింగేశాడు. దీంతో అతడిని పోలింగ్ అధికారులు పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.