VIDEO: ఫిరంగిపురంలో బీజేపీ ప్రశిక్షణ మహా అభియాన్
GNTR: ఫిరంగిపురంలో ఆదివారం పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై వివరించారు. ముఖ్యంగా ప్రజలకు ఈ పథకాలను ఎలా చేరవేయాలి, వాటి ప్రయోజనాలను ఎలా వివరించాలి అనే అంశాలపై అవగాహన కల్పించారు.