పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి: మాజీ కౌన్సిలర్

పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి: మాజీ కౌన్సిలర్

WNP: సీజనల్ వ్యాధులు సోకకుండా పరిసరాల పరిశుభ్రత పాటించాలని మాజీ కౌన్సిలర్ బండారు విజయ లక్ష్మి రాధా కృష్ణ సూచించారు. 31వ వార్డులో శుక్రవారం పరిసరాల పరిశుభ్రతపై కాలనీ వాసులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇంటి పరిసరాలలో పిచ్చి మొక్కలు తొలగింపుతో పాటు పాత వస్తువులు, ప్లాస్టిక్ డబ్బాలు, పాడైపోయిన కుండలు తదితర వాటిని పారవేయాలని వివరించారు.