నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఉంటేనే బోర్లకు అనుమతి

NLG: గృహేతర వినియోగానికి బోర్లు వేయాలనుకునేవారు భూగర్భ జల శాఖ కార్యాలయంలో నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తప్పనిసరిగా తీసుకోవాలని ఆ శాఖ ఉపసంచాలకులు రేవతి బుధవారం తెలిపారు. పారిశ్రామిక మైనింగ్ బల్క్, వాటర్ సప్లై, హోటళ్లు, ఆసుపత్రులు, తదితర బోరు బావుల కోసం నో అబ్జెక్షన్ పత్రం పొందాలని పేర్కొన్నారు. వారి నీటి అవసరాలను బట్టి దరఖాస్తు ఫీజు ఉంటుందని తెలిపారు.