ప్రచారంలో దూసుకుపోతున్న ఆడెపు రాజు
WGL: దుగ్గొండి మండలంలో పంచాయతీ ఎన్నికల కోలాహలం మొదలైంది. మహ్మదాపురం గ్రామంలో BRS సర్పంచ్ అభ్యర్థి ఆడెపు రాజు ప్రచారానికి తెరలేపారు. ఇంటింటికీ తిరుగుతూ బ్యాటు గుర్తుకే ఓటు వేయాలని గ్రామస్థులను కోరారు. అభివృద్ధి, సంక్షేమ పనులను కొనసాగించేందుకు తమకు అవకాశం ఇవ్వాలని కోరారు. “బ్యాటు గుర్తుకు ఓటు వేసి సర్పంచ్‌గా గెలిపిస్తాం” అంటూ గ్రామస్తులు ఆయనకు భరోసా ఇచ్చారు.