VIDEO: నీటి హౌస్‌లోకి దూరిన నాగుపాము
WGL: వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో శనివారం సారయ్య ఇంట్లోని నీటి హౌస్‌లోకి భారీ నాగుపాము దూరడంతో కలకలం రేగింది. కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ యాకూబ్ అక్కడికి చేరుకుని పామును పట్టుకుని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టాడు. దీంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.