రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

TG: నల్గొండ(D) వద్దిరెడ్డిగూడెం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నల్గొండ-దేవరకొండ ప్రధాన రహదారిపై అతివేగంగా ప్రయాణిస్తున్న కారు.. ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న కనగల్‌కు చెందిన నర్సింగ్ మధుబాబు, ధనుంజయ, కారులో ప్రయాణిస్తున్న బాల్ రెడ్డి మృతి చెందారు.