క్రికెటర్ తిలక్ వర్మను కలిసిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి
MBNR: ఆసియా కప్ హీరో, ప్రముఖ క్రికెటర్ తిలక్ వర్మను నగర నియోజకవర్గ నాయకులు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి మంగళవారం రాత్రి కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో అద్భుతమైన ఆట తీరుతో భారతదేశానికి విజయాన్ని సాధించి పెట్టడం గొప్ప విషయం అని అన్నారు. తిలక్ వర్మ తెలుగువాడైనందుకు ఎంతో గర్వంగా ఉందని వెల్లడించారు.