సీతారామ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్ అనుదీప్
KMM: సీతారామ ఎత్తిపోతల పథకం పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న భూ సేకరణ పనులను వెంటనే పూర్తి చేయాలని తెలిపారు. ఇవాళ కలెక్టరేట్‌లో సీతారామ ఎత్తిపోతల పథకంపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్, నీటిపారుదల, రెవెన్యూ, అటవీ శాఖల అధికారులు పాల్గొన్నారు.