రైతు బజార్లో వసతులు కల్పించండి: కలెక్టర్
VKB: జిల్లా కేంద్రంలోని రైతు బజార్‌ను బుధవారం కలెక్టర్ దీపక్ తివారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మార్కెట్‌లో కూరగాయల విక్రయదారులు, కొనుగోలుదారులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సరైన సౌకర్యాలు లేక విక్రయదారులు ఇబ్బంది పడుతున్నారని గుర్తించిన కలెక్టర్.. వెంటనే అక్కడ తాగునీరు, షెడ్లు వంటి మౌలిక వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు.