రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు

రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు

కృష్ణా: కృత్తివెన్ను మండలం సీతనపల్లిలో నవ జ్యోతి జూనియర్ కళాశాల విద్యార్థులకు ఎస్సై పైడి బాబు రోడ్డు భద్రత పై అవగాహన కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ... 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరుకు లైసెన్స్ ఉండాలని, వాహనం నడిపేవారు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు.