NIMSలో వసతుల కల్పనకు రూ.57 కోట్లు

HYD: పంజాగుట్ట NIMS ఆసుపత్రిలో CSR కింద అత్యాధునిక వైద్య పరికరాలు సమకూర్చడం కోసం స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నట్లుగా ఆసుపత్రి డైరెక్టర్ బీరప్ప తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి 19 సంస్థలు రూ.57 కోట్లు కేటాయించినట్లుగా పేర్కొన్నారు. ఈ నిధులతో అత్యాధునిక పరికరాలు, వసతులు సమకూర్చుతామని వివరించారు.