'వారానికి ఒక్కసారి కూడా తాగునీరు అందడం లేదు'

సంగారెడ్డి: ఖేడ్ పట్టణంలో వారానికి ఒక్కరోజు కూడా తాగునీరు సక్రమంగా సరఫరా కావడం లేదని BRS నాయకులు నజీబ్, పరశురాం, ముజామిల్ నేడు ఆవేదన వ్యక్తం చేశారు. 40వేలు జనాభా ఉన్న పట్టణంలో మిషన్ భగీరథ ద్వారా తాగు నీరు అందించడంలో అధికారులు చర్యలు తీసుకోవడం లేదన్నారు. కొత్త నల్లా కనెక్షన్ కోసం రూ. 5వేలు టాక్స్ వసూలు చేస్తున్నారని చెప్పారు. సక్రమంగా నీరు సరఫరా చేయాలని కోరారు.