నాకు దిగజారాల్సిన అవసరం లేదు: గడ్కరీ

నాకు దిగజారాల్సిన అవసరం లేదు: గడ్కరీ

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తన మెదడు నెలకు రూ.200 కోట్లు సంపాదించగలదని వెల్లడించారు. పెట్రోల్‌లో ఇథనాల్ కలుపుతున్న విషయంలో జరుగుతున్న అవినీతి ఆరోపణలను ఆయన ఖండించారు. తనకు షుగర్ ఫ్యాక్టరీ, డిస్టిలరీ, పవర్ ప్లాంట్ ఉన్నాయని, ఆదాయానికి ఎలాంటి లోటు లేదని.. దిగజారాల్సిన అవసరం లేదని తెలిపారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.